India Lockdown : Modi Telugu Speech On Lockdown | ఇంటి గడపే లక్ష్మణరేఖ | Oneindia Telugu

Oneindia Telugu 2020-03-25

Views 206

Watch Modi Telugu Speech On India Lockdown. PM Narendra Modi on Tuesday announced that entire India will be locked down for the next 21 days from midnight tonight and urged Indians to forget what stepping out feels like, or warned that the entire country will go back 21 years.

#IndiaLockdown
#ModiTeluguSpeech
#IndiaLockdownApril14th
#pmmodi
#nationwidelockdown
#stateslackdown
#indiashutdown

చేతులెత్తి నమస్కరిస్తున్నా ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం అవ్వండి అన్న ప్రధాని మోడీ. 21 రోజుల పాటు లాక్‌డౌన్ అంటే సుదీర్ఘ సమయమే కానీ ఆరోగ్యం ముందు ఏదీ పెద్దది కాదు: ప్రధాని మోడీ. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే ఆ గొలుసుకు ఎక్కడో ఒకచోట బ్రేక్ వేయాలి.. అది కేవలం సోషల్ డిస్టెన్సింగ్ ద్వారానే సాధ్యమవుతుంది అన్న ప్రధాని మోడీ.కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం, మంగళవారం నాటికి రోగుల సంఖ్య దాదాపు 500కు చేరిన నేపథ్యంలో అత్యయిక పరిస్థితి తప్పదని కేంద్రం భావించింది. దీనిపై మంగళవారం రాత్రి ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, కొంచెం కష్టమే అయినా గడ్డు కాలాన్ని ఎదురించడానికి జాగ్రత్తలు తప్పనిసరి అని ప్రధాని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలే బేలచూపులు చూస్తున్నవేళ.. భారత్ తనదైన పట్టుదలతో కరోనా సవాలును ధీటుగా ఎదుర్కొంటుందని, అది ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS