Virender Sehwag feels with current composition of the Indian team will make it difficult for MS Dhoni to make a comeback into the national fold. Dhoni, India’s most successful captain with three ICC Trophy wins, last played for India during the semifinal of the World Cup last year and since has been away from the game.
#MSDhoni
#VirenderSehwag
#IPL2020
#chennaisuperkings
#csk
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి జట్టులో చోటెక్కడుంది అని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నాడు. ధోనీ టీమిండియాలోకి మళ్లీ పునరాగమనం చేయడం ఇక కష్టమే అని అభిప్రాయపడ్డాడు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్, బ్యాటింగ్‌లో రాణిస్తున్నారని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ధోనీ, సెహ్వాగ్‌ల మధ్య విభేదాలు ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మహీ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేశాడు. ధోనీ సారథ్యంలోనే 2011 ప్రపంచకప్‌లో సెహ్వాగ్ ఆడాడు.తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... 'జట్టులో ధోనీకి చోటు ఎక్కడుంది?. అతడు ఎక్కడ సరిపోతాడు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ ఇప్పటికే ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా రాహుల్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లలో రాహుల్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంకా ధోనీ గురించి ఆలోచించేందుకు కారణం ఏముంది' అని అన్నాడు. సెహ్వాగ్ మాటలను బట్టి చూస్తే.. ధోనీ రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పకనే చెప్పాడు.