U19 World Cup 2020 Semi Final 1 : India will face Pakistan in the U19 World Cup semifinal on Tuesday. Pakistan have not defeated India in U19 World Cup since 2010
#U19WorldCup2020
#U19WorldCupSemiFinal1
#YashasviJaiswal
#ShubmanGill
#RaviBhisnoi
#KartikTyagi
#AtharvaAnkolekar
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య మరి కొన్ని గంటల్లో మెగా సమరం జరగనుంది. అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో ఇరు జట్లు హోరాహోరీ పోరుకు సిద్దమయ్యాయి. గత రెండు పర్యాయాలు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన యువ భారత జట్టు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి వరుసగా మూడోసారి తుదిపోరుకు అర్హత సాధించాలని చూస్తోంది. 2010 మెగాటోర్నీ తర్వాత భారత్‌పై ఒక్కసారి కూడా గెలువని పాకిస్థాన్ ఈ సారి ముందంజ వేయాలని కృతనిశ్చయంతో ఉంది. భారత్ గతంలో నాలుగు సార్లు ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంటే.. పాక్ రెండు సార్లు విజేతగా నిలిచింది.