Janasena Chief Pawan Kalyan planning to huge parade in Amaravati in support of local people and farmers. Along with all parties pawan want to conduct this parade.
#Amaravatifarmers
#PawanKalyan
#capitalAmaravati
#Parade
#apcmjagan
#parties
రాజధానుల వ్యవహారం పైన జనసేన అధినేత పవన్ ఇక ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయించారు. ఇందు కోసం రైతులు..మద్దతుదారులతో కలిసి భారీ కవాతుకు నిర్ణయించారు. ఇప్పటికే పవన్ కొద్ది రోజు ల క్రితం అమరావతి రైతులకు సంఘీభావంగా అక్కడి గ్రామాల్లో పర్యటించిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు అక్కడి రైతులు..అందులోనూ మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో..తాను వారికి మద్దతుగా నిలిచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఈ నెల 18 లేదా 19వ తేదీల్లో పవన్ అమరావతి..విజయవాడలో కవాతుకు నిర్ణయించారు. దీని పైన ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు చర్చలు చేసారు. రూటు మ్యాప్ సిద్దం చేసి...శనివారం పవన్ అధ్యక్షతన జరిగే పార్టీ సమావేశంలో దీని పైన అధికారిక ప్రకటన చేయనున్నారు.