మధుమేహం వచ్చిన రెండు నుంచి మూడు సంవత్సరాలవరకు కిడ్నీ ప్రభావితం కాదు. మూడు సంవత్సరాల తర్వాత ప్రతి పది మందిలో ఇద్దరకీ లేదా ముగ్గురికి కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ కిడ్నీ వ్యాధి ఐదు నుంచి పది సంవత్సరాలవరకు ఎటువంటి లక్షణాలు చూపించదు.
తొలి దశలో ప్రోటీన్ వెళ్లిపోవడం చాల తక్కువగా ఉంటుంది, ఈ దశలో మనం చికిత్స మరియు జాగ్రతలు తీసుకుంటే తిరిగి పూర్వ స్థితిని పొందవచ్చు. తర్వాతి దశలలో ఈ ప్రోటీన్ వెళ్లిపోవడం ఎక్కువ ఉంటుంది అప్పుడు వ్యాధి సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి.
ఇది ఇలానే కొనసాగినపడు కిడ్నీ పనితనం ఆగిపోయి శరీరంలో మలినాలు పెరిగిపోతాయి. ఇక చివరిదశలో ఏమి చెయ్యలేని విశ్రాంతి స్థాయికి రావచ్చు.
కిడ్నీ మధుమేహం వలన పాడైనప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? consultant nephrologist యొక్క విశ్లేషణ.