Sourav Ganguly Names Sehwag was the biggest match-winner of His Generation

Oneindia Telugu 2019-12-30

Views 273

Sourav Ganguly, who is regarded as one of India’s best captains, played with some of India’s greatest cricketers during his time. He told Sehwag was
the biggest match-winner in that generation as an opener.
#SouravGanguly
#Sehwag,
#SachinTendulkar
#SunilGavaskar
#VVSLaxman


తన తరంలో అతిపెద్ద మ్యాచ్‌ విన్నర్‌ వీరేంద్ర సెహ్వాగేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. భారతదేశపు ఉత్తమ కెప్టెన్లలో ఒకడిగా పరిగణించబడే గంగూలీ అతని కాలంలో భారతదేశపు గొప్ప క్రికెటర్లు సౌరవ్ గంగూలీ... సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్‌తో ఆడారు.

అంతేకాదు టీమిండియాకు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ను ఏర్పాటు చేశాడు. అయితే, తన తరంలో అతిపెద్ద మ్యాచ్‌ విన్నర్‌ మాత్రం సెహ్వాగేనని దాదా స్పష్టం చేశాడు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో గంగూలీ మాట్లాడుతూ "ఓపెనర్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ మా కాలంలో అతిపెద్ద మ్యాచ్‌ విజేత" అని అన్నాడు.

నాకు అతడిపై సొంత నమ్మకం ఉంది. అతడిని ఓపెనర్‌గా బరిలోకి దిగమని చెప్పాను. తమ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికి అలవాటు పడకుండా, జట్టు కోసం అన్ని స్థానాల్లో బరిలోకి దిగడానికి సన్నద్ధంగా ఉండాలని అన్నాను" అని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.

Share This Video


Download

  
Report form