Citizenship Amendment Act: Protesting students blocked convoy of West Bengal Governor Jagdeep Dhankhar as he arrived at Jadavpur University on Dec 24. Protestors showed black flags and also raised slogans against the governor.
#CitizenshipAmendmentAct
#JagdeepDhankhar
#NRC
#JadavpurUniversitystudents
#WestBengalGovernor
జాదవ్ యూనివర్సిటీ(జేయూ)లో మంగళవారం కాన్వకేషన్ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు వెళ్లిన వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధనకర్ కు చేదు అనుభవం ఎదుదైంది.
వర్సిటీలోకి రానివ్వకుండా విద్యార్థులు, వర్సిటీ స్టాఫ్ ఆయనను గేటు బయటే అడ్డుకున్నారు. తీవ్ర మనస్తాపం చెందిన గవర్నర్ మీడియాతో గోడు వెళ్లబోసుకున్నారు.
పౌరసత్వ సవరణ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు.. ఆ రెండు చట్టాలపై క్లారిటీ ఇవ్వాలని గవర్నర్ ను డిమాండ్ చేశారు.
సోమవారం కూడా జేయూలో సరిగ్గా ఇలాంటి సీన్లే చోటుచేసుకున్నాయి. నల్లజెండాలతో నిరసన తెలిపిన స్టూడెంట్లు.. గవర్నర్ గోబ్యాక్ నినాదాలు చేయడంతో గవర్నర్ లోనికి వెళ్లకుండానే వెనుదిరిగారు. దీంతో కాన్వకేషన్ ప్రోగ్రామ్ ను మంగళవారానికి వాయిదా పడింది.