National Film Awards : Keerthi Suresh Receive Best Actress award From VP Naidu

Filmibeat Telugu 2019-12-24

Views 1.9K

National Film Awards : The Vice President M Venkaiah Naidu attended 66th National Film Award ceremony in New Delhi on Dec 23. Information and Broadcasting Minister Prakash Javadekar was also present during the event.
#NationalFilmAwards
#keerthiSuresh
#AkshayKumar
#AyushmannKhurrana
#andhadhun
#tollywood
#bollywood
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్రం అవార్డుల ప్రదానోత్సవం సోమవారం నాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతోంది. చలన చిత్ర రంగంలో ప్రతిభని కనబరిచి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న చిత్రాలతో పాటు నటీనటులకు జాతీయస్థాయిలో అవార్డులను అందజేస్తున్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తారలు అవార్డులు అందుకుంటున్నారు. 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఈ ఏడాది ఆగస్ట్ లోనే ప్రకటించారు. ఇందులో ఉత్తమ చిత్రంగా గుజరాత్ సినిమా 'హెల్లరో' నిలవగా.. 'ఉరి' చిత్రంలో నటించిన విక్కీ కౌశల్, 'అంధాధున్'లో నటించిన ఆయుష్మాన్ ఖురానా సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.
'మహానటి' చిత్రంలో నటించిన కీర్తి సురేష్ కి ఉత్తమ నటి అవార్డు వరించింది. ఈ మేరకు అవార్డు తీసుకోవడానిక స్టేజ్ పైకి వెళ్లిన ఆమె ఆనందానికి అవధుల్లేవు.

Share This Video


Download

  
Report form