Watch Winter Session of Andhra Pradesh Assembly News. AP Assembly passed historical Disha 2019 bill unanimously. AP Govt proposed in bill if conclusive evidence there, then they will punish within 21 days.
ఏపీ అసెంబ్లీ సంచలన దిశ బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం ఎవరైనా మహిళల పైన అత్యాచారానికి..అఘాయిత్యాలకు పాల్పడితే వారికి 21 రోజుల్లోనే మరణ శిక్ష పడేలా బిల్లులో పేర్కొన్నారు. బాధితురాలి కి సత్వర న్యాయం జరిగేలా ఈ చట్టం తీసుకొస్తున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. మహిళల జోలికి వెళ్లాలనుకొనే వారికి వెన్నులో వణుకు పుట్టేలా చట్టం ఉండాలని..అందుకే ఇటువంటి బిల్లును తీసుకొచ్చామని ప్రకటించారు. ఘటన జరిగిన తరువాత తొలి ఏడు రోజుల్లోనే కావాల్సిన ప్రాధమిక సమాచారం సేకరణ..ఆ తరువాత 14 రోజుల్లోనే విచారణ పూర్తి చేసేలా బిల్లులో పొందుపరిచారు. ఇందు కోసం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రత్యేకంగా పాస్ట్ ట్రాక్ కోర్టులు..డీఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక పోలీసుల టీంలు..అదే విధంగా ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#ysrcp
#APAssemblyLIVE
#naralokesh
#Buggana
#dishabill
#DishaBill2019