Rishabh Pant will once again be in focus when India take on the West Indies in a 3-match T20I series.
but BCCI president Sourav Ganguly said this kind of pressure was good for the young cricketer.
#IndiavsWestIndiesT20
#msdhoni
#viratkohli
#RishabhPant
#rohitsharma
#KLRahul
యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్ మైదానంలో ధోనీ నినాదాలు వినేందుకు అలవాటు పడాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అభిమానులు చేస్తోన్న ఆ నినాదాలను వింటూనే వాటి ఒత్తిడి నుంచి బయటపడేందుకు మార్గం వెతకాలని దాదా సూచించాడు.
శుక్రవారం ఇండియా టుడే కాన్‌క్లేవ్ ఈస్ట్ 2019లో రిషబ్ పంత్ పేలవ ఫామ్‌పై సౌరవ్ గంగూలీ స్పందించాడు. గంగూలీ మాట్లాడుతూ "ఆ నినాదాలు పంత్‌కు మంచివే. వాటికి అతడు అవాటు పడాలి. అవి వింటూనే విజయవంతం అవ్వడానికి దారి కనుక్కోవాలి. ఒత్తిడిని ఎదుర్కొంటూనే అతడు క్రికెట్లో తన ముద్ర వేయాలి" అని అన్నాడు.