#SaveTeluguFromYSRCP : Jana Sena Chief Pawan Kalyan Has Began A Hash Tag Movement Against YSRCP

Oneindia Telugu 2019-11-20

Views 1.1K

Jana Sena Party led by Pawan Kalyan has began Save Telugu from YSRCP hash tag movement against Government of Andhra Pradesh decision. The Government of Andhra Pradesh has decided that teaching in English medium should implement in all Government Schools in the state.
#PawanKalyan
#SaveTeluguFromYSRCP
#JanaSenaParty
#YSRCP
#YSJaganmohanreddy
#tdp
#andhrapradesh

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంలో విద్యను బోధించాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలపై చెలరేగిన వివాదాలు, విమర్శల దుమారం ఇంకా తగ్గలేదు. ఆరంభంలో తెలుగుదేశం పార్టీ కూడా జనసేనతో కలిసి ఉమ్మడిగా నిరసన గళాన్ని వినిపించింది. క్రమంగా తెలుగుదేశం వెనక్కి తగ్గినప్పటికీ.. జనసేన పార్టీ తన వైఖరిని మార్చు కోలేదు. తెలుగు భాషను పరిరక్షించడానికి సరికొత్త ఉద్యమాన్ని చేపట్టింది.సోషల్ మీడియాను కేంద్రబిందువుగా చేసుకుని జనసేన పార్టీ ఏకంగా హ్యాష్ ట్యాగ్ ఉద్యమాన్ని చేపట్టింది. `సేవ్ తెలుగు ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ`. ఈ పేరుతో హ్యాష్ ట్యాగ్ ఉద్యమాన్ని తాజాగా ప్రారంభించింది. ఈ హ్యాష్ ట్యాగ్ ఉద్యమంతో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యను బోధించడం సంభవించే నష్టాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడం వల్ల విద్యార్థులు మాతృభాషపై పట్టును కోల్పోతారని చెబుతున్నారు జనసేన నాయకులు. తమ అభిప్రాయాలు, ఆలోచనలకు హ్యాష్ ట్యాగ్ ను జోడిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS