Cine Box : Nandamuri Balakrishna Suggestions To Boyapati Sreenu For Their Upcoming project. Present. He Is Doing Ruler Movie With KS Ravikumar.This Movie Is Produced By C Kalyan. Bhumika, Prakash Raj, Sonal Chauhan Are Playing Important Character.
#cinebox
#balakrishna
#ruler
#kammarajyamlokadaparedlu
#rgv
#MaheshBabu
#SarileruNeekevvaru
#SarileruNeekevvaruteaser
#RRR
#alavaikunthapuramulo
#rahulsipligunj
#tollywood
నందమూరి బాలకృష్ణ సినిమాలంటే ఒన్లీ యాక్షన్, అభిమానులకే పరిమితం అనేలా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మార్చాలని చూస్తున్నారని టాక్. ఇకపై చేయబోయే సినిమాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని అనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్' చిత్రాన్ని కంప్లీట్ చేసిన ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో డిసెంబర్ నెలలోనే కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ఒకరకమైన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' చిత్రాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. హ్యాట్రిక్ హిట్ కోసం ఈ ఇద్దరూ మరోసారి సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అయితే యాక్షన్ పాళ్లు హద్దులు దాటకుండా చూడమని బోయపాటికి బాలకృష్ణ సలహా ఇచ్చినట్లు టాక్. అంతేకాదు మాస్ ఆడియన్స్ తో పాటు యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చేలా కథాకథనాల్లో కొత్తదనం ఉండేలా చూడమని అన్నారట. ఆ సూచనలను దృష్టిలో పెట్టుకునే బోయపాటి స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు. ఇక కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన 'రూలర్' చిత్రం, త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.