Plastic To Be Stop Using In Telangana Says KCR || తెలంగాణలో ప్లాస్టిక్‌ ఉత్పత్తి,విక్రయాలపై నిషేధం

Oneindia Telugu 2019-10-12

Views 124

The Telangana government is contemplating Stop Using single-use plastic. Chief Minister K Chandrasekhar Rao gave an indication to this effect at a meeting with district collectors at Pragathi Bhavan here on Thursday.
#Plastic
#SingleUsePlastic
#saynotoplasticbags
#avoidplasticbags
#plasticpollution
#telanganacmkcr
#pragathibhavan


పర్యావరణాన్ని విపరీతంగా దెబ్బతీస్తూ జీవకోటి మనుగడకే ముప్పుగా మారిన ప్లాస్టిక్‌ ఉత్పత్తి, విక్రయాలను రాష్ట్రంలో నిషేధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. దీనికి సంబంధించిన విధానాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పచ్చదనం–పరిశుభ్రత పెంపు లక్ష్యంగా నిర్వహించిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ (పల్లె ప్రగతి) అమలు జరిగిన తీరుపై సీఎం కేసీఆర్‌ గురువారం ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లు,ముఖ్య కార్యదర్శులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ భేటీ రాత్రి 9 గంటలకు ముగిసింది. ఈ భేటీలో ప్లాస్టిక్‌పై నిషేధం, గ్రామ పంచాయతీల సిబ్బందికి రూ. 2 లక్షల జీవిత బీమా, ఏటా మూడుసార్లు పల్లె ప్రగతి, అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి నిర్వహణ, ప్రతి జిల్లా కలెక్టర్‌కు రూ. 2 కోట్ల ప్రత్యేక నిధులకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించారు. ఈ సమావేశంలో ప్రతి జిల్లా కలెక్టర్‌ 30 రోజుల కార్యక్రమం అమలులో వారి అనుభవాలను వివరించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు సమష్టి ప్రణాళిక, కార్యాచరణ, అభివృద్ధి ఆశయాలతో కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS