The Indian Space Research Organisation, or Isro, is making all possible efforts to establish communication with Vikram lander that has been lying on the moon for three days now, the space agency tweeted on Tuesday. “VikramLander has been located by the orbiter of #Chandrayaan2, but no communication with it yet,” the official Isro handle tweeted on Tuesday. It said the agency was making all possible efforts to establish communication with the lander.
#isro
#moon
#Chandrayaan2
#Vikramlander
#orbiter
#communication
#Bangalore
#SilentMode
చంద్రుడి ఉపరితలంపై దిగినట్లు భావిస్తోన్న విక్రమ్ ల్యాండర్ తో అనుసంధానం కావడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు చేస్తోన్న ప్రయత్నాల్లో మరిన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ నెల 7వ తేదీన చంద్రుడిపై అడుగు పెట్టబోయే సమయంలో విక్రమ్ ల్యాండర్ ఆచూకీ తెలియరాకుండా పోయిన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలం నుంచి సరిగ్గా 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉన్న సమయంలో ల్యాండర్ నుంచి బెంగళూరులోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్ కు సంకేతాలు స్తంభించిపోయాయి. అప్పటి నుంచి ల్యాండర్ నుంచి ఎలాంటి డేటా గానీ, ఫొటోలు గానీ గ్రౌండ్ స్టేషన్ కు అందలేదు. దీనితో ఈ ప్రయోగం విఫలమైనట్లు భావించారు. అయినప్పటికీ.. ల్యాండర్ జాడను పసిగట్టడానికి శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు వృధాగా పోలేదు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే, నిర్దేశించిన ప్రదేశంలోనే ల్యాండర్ దిగినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో ఛైర్మన్ కే శివన్ ప్రకటించారు. తాము ఊహించినట్టుగా సాఫ్ట్ గా ల్యాండింగ్ కాలేదని, క్రాష్ ల్యాండింగ్ జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. క్రాష్ ల్యాండింగ్ వల్లే ల్యాండర్ తో సంబంధాలు తెగిపోయినట్లు ధృవీకరించారు.