Former skipper Anil Kumble's ability to boost confidence of the players makes him an ideal candidate for the role of chairman of selectors, said Virender Sehwag, who also advocated a hike in remuneration for the job. Never to mince his words, former opener Sehwag said BCCI needs to pay more for heading the selectors'
#anilkumble
#bcci
#virendrasehwag
#teamindia
#cricket
చీఫ్ సెలక్టర్ పదవికి కుంబ్లే అన్ని విధాలా అర్హుడని సెహ్వాగ్ అన్నాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ "కుంబ్లే సెలక్టర్ల ఛైర్మన్ పదవికి సరైన అభ్యర్థి. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లతో మంచి అనుబంధం ఉంది. కోచ్‌గా ఆటగాళ్లతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి" అని అన్నాడు."2007-08 ఆస్ట్రేలియా సిరీస్ అప్పుడు అనిల్ కుంబ్లే మా కెప్టెన్. ఆ సమయంలో నాకు ఎంతో ధైర్యం చెప్పాడు. రెండు సిరీస్‌ల వరకూ నువ్వు జట్టులోనే ఉంటావు అని అన్నాడు" ఆ మాటలు తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. కుంబ్లే చీఫ్ సెలక్టర్‌ను చేసి అతని వేతనం కూడా పెంచాలని సెహ్వాగ్ బీసీసీఐని కోరాడు."ప్రస్తుతం ఛైర్మన్‌కి ఏడాదికి రూ.కోటి చెల్లిస్తున్నారు. దీనిని పెంచకుంటే కుంబ్లే ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చెప్పట్టేందుకు ఒప్పుకోరు" అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. కాగా, ప్రస్తుతం ఉన్న చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్‌పై ఈ మధ్యకాలంలో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.