Jammu and Kashmir: Mobile Internet Snapped, Section 144 To Be Imposed From 6AM | Oneindia Telugu

Oneindia Telugu 2019-08-05

Views 603

Jammu and Kashmir:National Conference chief Omar Abdullah and PDP chief Mehbooba Mufti have been put under house arrest as the authorities imposed restrictions on the people's movements across Srinagar. Mobile and internet services have also been suspended in the Valley.
#JammuandKashmir
#MehboobaMufti
#OmarAbdullah
#MobileInternetservices
#144section

కొద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉంటోన్న జమ్మూ కాశ్మీర్ సోమవారం నాటికి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శ్రీనగర్ జిల్లాలో 144 సెక్షన్ విధించారు. పౌర జీవనంపై ఆంక్షలు విధించారు. ఇద్దరికి మించి గుమికూడదని సైన్యం ఆదేశాలు జారీ చేసింది. జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్‌ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు.
ఇతర రాష్ట్రాల విద్యార్థులను రాత్రికి రాత్రి వారి స్వస్థలాలకు తరలించారు. మరోవంక- ప్రభుత్వం నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేతలను గృహ నిర్బంధంలో ఉంచింది. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వారి ఇళ్లల్లో వారు బందీలు అయ్యారు. వారితో పాటు కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎంవై తరిగమిలను సైతం అరెస్టు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS