Indian bowlers had a great day with the ball as all of them took wickets to restrict West Indies for a paltry 95/9 in the first T20 international of the three-match series at the Central Broward Regional Park in Lauderhill
#msdhoni
#Navdeep Saini
#rishabhpant
#viratkohli
#westindiestourofindia2019
#icccricketworldcup2019
ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ విండీస్ జట్టును ముప్పు తిప్పలు పెట్టింది. తొలి ఓవర్ నుంచే విండీస్ బ్యాట్స్ మెన్ తడబడుతూ బ్యాటింగ్ మొదలు పెట్టారు. ఖాతా తెరవకుండానే ఓపెనర్ క్యాంప్‌బెల్ క్రూనల్ పాండ్యాకు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. ఇక మరో ఓపెనర్ లెవిస్ కూడా రెండో ఓవర్‌లో భువనేశ్వర్ వేసిన ఆరో బంతికి బౌల్డయ్యాడు. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన నికోలస్ పూర్ 4వ ఓవర్లో నికోలస్ పూరన్ (20) నవదీప్ సైనీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అవ్వగా, మరో బ్యాట్స్‌మ్యాన్ షిమ్రాన్ హెట్ మెయర్ కూడా సున్న పరుగులకే వెనుదిరగడంతో విండీస్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. అనంతరం రోవ్ మన్ పావెల్ సైతం నాలుగు పరుగులకే ఔటయ్యాడు దీంతో విండీస్ 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత వచ్చిన సునీల్ నరైన్, బ్రాత్ వైట్ సైతం సింగిల్ డిజిట్ పరుగులకే ఔటయ్యారు. విండీస్ బ్యాట్స్ మెన్ లో కేవలం పొలార్డ్ మాత్రమే 49 పరుగులు చేశాడు.