"No one is giving respect to the music directors. Their condition has worsened." Veteran Music director Koti about Present Music composers Situation.
#tollywood
#manisharma
#koti
#arrahaman
#movienews
#MusicDirectors
ఒకప్పటితో పోలిస్తే మ్యూజిక్ డైరెక్టర్లకు ఇపుడు ఇండస్ట్రీలో గౌరవం తగ్గిపోయిందని, దర్శక నిర్మాతలు కూడా ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కంపోజర్లకు ఇవ్వడం లేదని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి వ్యాఖ్యానించారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఈ యంగ్ జనరేషన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది, మా రోజుల్లోనే పరిస్థితి చాలా బావుండేదని తెలిపారు. ఇపుడు పరిస్థితి ఎలా తయారైందంటే.. ఎవరు తక్కువ బడ్జెట్లో మ్యూజిక్ కొడితే వారికే ఇచ్చేస్తున్నారు. సినిమా రంగంలో మ్యూజిక్ అనేది ఇపుడు చాలా క్రిందకు దిగజారిపోయిందని కోటి చెప్పుకొచ్చారు. దాని వల్ల ఎవరికీ వ్యాల్యూ లేకుండా పోయింది. ఏ కంపోజర్ అయినా మూడు లేదా నాలుగు సినిమాలకు మించి ఇండస్ట్రీలో ఉండటం లేదు, ఆ తర్వాత కనబడకుండా పోతున్నారని తెలిపారు.