AP Home Minister Sucharitha Strong Counter on Chandrababu's Z Category Security.
#homeministersucharitha
#chandrababusecurity
#chandrababunaidu
#ysjagan
#ysrcp
#tdp
#mekathotisucharitha
#ZCategorySecurity
ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సెక్యూరిటీ రివ్యూ కమిటీ సూచించిన దానికంటే ఎక్కువ భద్రత కేటాయించామని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సూచించిన ప్రకారం వాస్తవంగా 58 మందినే భద్రత కోసం కేటాయించాలని ఆమె తెలిపారు.కానీ ఇప్పటికే74 మంది భద్రతా సిబ్బంది వివిధ కేటగిరిల్లో చంద్రబాబునాయుడుకు రక్షణగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. తాను విపక్ష నేత అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రతి అంశానికి ప్రతిపక్షనేత, వారి మద్దతుదారులు రాజకీయ రంగు పులుముతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, ప్రచారం కల్పించడం మానుకోవాలని హితవు పలికారు. బులెట్ ప్రూఫ్ కారు, ఎస్కార్ట్ కారు కూడా ఇచ్చామని, అయినా కూడా భద్రత తొలిగించామని ఆయన ఆరోపించడం సరికాదని మంత్రి అన్నారు.