సరికొత్త ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ || Hyd Traffic Wing Introduced A New Signalling System

Oneindia Telugu 2019-07-03

Views 2

Hyderabad traffic wing introduced a new method in signalling system at KBR Park Junction. They adopted a new method to control traffic during the night time. Till now, the traffic signal lights on polls have been used to control the traffic.
#hyderabad
#traffic
#kbr
#SignallingSystem
#KBRPark
#lights

మూడు రంగుల లైట్లతో చౌరస్తాలో కనిపించే ఓ స్తంభం.. ట్రాఫిక్ సిగ్నల్ అంటే ఇప్పటి వరకు అందరికీ గుర్తొచ్చేది ఇదే. కానీ త్వరలోనే ఇది మారబోతోంది. సిగ్నల్ లైట్లు స్తంభం పై నుంచి దిగి నేలపైకి రానున్నాయి. అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే హైదరాబాద్ మహానగరం ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఎల్ఈడీ స్టాప్ లైన్ సిగ్నలింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. వాహనదారులతో పాటు పాదచారులకు ఉపయోగపడేలా ఈ సరికొత్త ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను కేబీఆర్ పార్క్ వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS