పెన్షన్‌లపై తొలి సంతకం!! APని ఉద్యోగాంద్ర చేస్తానన్న జగన్!! | Oneindia Telugu

Oneindia Telugu 2019-05-30

Views 342

After swearing-in as Nava Yuva Chief Minister YS Jagan Mohan Reddy has first signed on the YSR pension scheme in Vijayawada on Thursday. During the Yatra, YS Jagan has promised to raise the old age pension to Rs 3000. After swearing-in as the Chief Minister YS Jagan has signed the first GO on the hike of pension to Rs 2250 and this increased pension will be applicable from 1st June.
#jagan
#ycp
#chiefminister
#andhrapradesh
#Governornarasimhan
#vijayawada
#KCR
#YSR Pension
#First Sign

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెన్షన్‌లపై తొలి సంతకం చేశారు. రాష్ట్రంలోని వృద్ధులకు రూ.2250 నెలకు పెన్షన్ కింద ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వెంటనే పెన్షన్‌పై మొదటి సంతకం పెట్టారు. అంతే కాకుండా ప్రతి ఏడాది ఈ పెన్షన్ మొత్తాన్ని పెంచనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం దీనిని 2500 రూపాయలు చేయనున్నట్లు, ఆ తదుపరి సంవత్సరం 2750 రూపాయలు, అనంతరం 3000 రూపాయలకు పెంచనున్నట్లు జగన్ తెలిపారు. తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ ముసలి అవ్వ చెప్పిన సంగతులను గుర్తు చేసుకున్నారు. అవ్వతాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నామని, రెండు చేతులు జోడించి పేరుపేరునా ఆశీస్సులు కోరుతున్నానని జగన్ అన్నారు.

వైఎస్ జగన్ అనే నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను అంటూ ప్రమాణం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఒకరిగా మీలో నిలిచినందుకు ఆకాశమంత విజయాన్నిఅందించినందుకు ప్రతి ఒక్కరికీ రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రికి, రేపు తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న స్టాలిన్ కి , పెద్దలందరికీ పేరుపేరునా నమస్సుమాంజలి తెలుపుకుంటున్నానని అన్నారు. రాజకీయ జీవితంలో పాదయాత్రలో పెదల కష్టాన్ని చూసానని అన్నారు. పేదల కష్టాన్ని చూసిన తర్వాత మీ అందరికీ నేను ఉన్నానని అన్నారు. మీ బాధలు విన్నాను...నేను ఉన్నానని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS