Chennai Super Kings 155 for 6 (Dhoni 58, Rayudu 57, Stokes 2-39) defeat Rajasthan Royals 151 for 7 (Stokes 28, Buttler 23, Jadeja 2-20) by four wickets
#IPL2019
#MSDhoni
#ChennaiSuperKings
#RajasthanRoyals
#josButtler
#Jadeja
#ambatiRayudu
#BenStokes
మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన చెన్నై ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయలేకపోయిన రాజస్థాన్ కెప్టెన్ అజింక్య రహానె (14: 11 బంతుల్లో 3x4) వికెట్ల ముందు దొరికిపోయాడు. బంతి నేరుగా వెళ్లి రహానె ఫ్యాడ్స్‌ని తాకడంతో.. చెన్నై టీమ్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. దీంతో.. ధోనీ వద్దకి వెళ్లిన చాహర్.. డీఆర్‌ఎస్ అడగాల్సిందిగా కోరాడు. దీంతో..అతనితో కొద్దిసేపు బంతి గమనంపై చర్చించిన ధోనీ.. డీఆర్‌ఎస్ గడువు మరో సెకనులో ముగుస్తుందనగా.. రివ్వ్యూ కోరాడు. నిబంధనల ప్రకారం.. బంతి డెడ్ అయిన తర్వాత 15 సెకన్లలోపు డీఆర్‌ఎస్ కోరేందుకు అవకాశం ఉంటుంది.