AP Election 2019 : Subramanian Swamy Says Chandrababu Naidu Behaves Like Monkey In Circus | Oneindia

Oneindia Telugu 2019-03-14

Views 2

“Naidu has been jumping around like a monkey in a circus ring. We (the BJP government) had informed that the SCS could not be given to the state and he (Naidu) too stuck with NDA when we offered financial assistance to the residuary state. After four years, he jumped to the side of Congress,” Subrahmanya Swamy said.
#APElection2019
#SubramanianSwamy
#ChandrababuNaidu
#TDP
#tdpcandidateslist
#BJP
#TTD

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కస్ రింగ్ లో కోతి లా అటూ, ఇటూ తిరుగుతూ ఉంటూ ప్రేక్షకులను నవ్విస్తూ వుంటారు అని బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు..రాష్ట్ర సంక్షేమం పేరును అడ్డు పెట్టుకుని కూటముల మధ్య అటూ, ఇటూ తిరిగారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ కూటమిలో చేరిపోయారు.. అని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. మొదట ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారని ఆయన గుర్తుచేశారు. కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారని అన్నారు. ప్యాకేజీని స్వాగతిస్తున్నామని అంటూ చంద్రబాబు న్యూఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులకు శాలువాలు కప్పి, సన్మానం చేశారని చెప్పారు. అనంతరం ప్రత్యేక హోదా కావాలంటూ యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS