After the Pulwama tragedy, Indian fans have urged Virat Kohli and Co to not play Pak in the forthcoming 2019 ICC World Cup in England.
#WorldCup2019
#ViratKohli
#teamindiasqardinworldcup
#ICCWorldCup
#Pulwamatragedy
#MSDhoni
#rohithsharma
#cricket
#Teamindia
పుల్వామా ఘటన చోటు చేసుకున్న తరువాత పాకిస్తాన్ తో ప్రపంచ కప్ ఆడకూడదన్న డిమాండ్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత క్రికెటర్ హర్బజన్ పాకిస్తాన్ తో ఎట్టి పరిస్థితిలో క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని కొండబద్దలు కోటినాడు. అలాగే రాజీవ్ శుక్లా కూడా ప్రపంచ కప్ లో పాకిస్తాన్ ఆడేది కష్టమేనని మాట్లాడినాడు.
అయితే ఈ పరిణామాల నేపధ్యం లో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ స్పందించారు. "ప్రస్తుతానికి ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ లో ఎటువంటి మార్పు లేదని యధాప్రకారమే జరుగుతందని " తెలిపారు. అయితే జూన్ 16 న మాంచెస్టర్ లో భారత్ - పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది . ఇంకా రిచర్డ్సన్ స్పందిస్తూ పుల్వామా ఘటన లో మరణించిన జవాన్లకు తన సానుభూతి వ్యక్తం చేసాడు. ప్రస్తుతం ఈ విషయం పై ఐసీసీ సభ్య దేశాలతో సమీక్షిస్తున్నామని తెలిపారు.
అయితే లీగ్ దశలో పాకిస్థాన్ తో భారత్ ఆడాల్సిన అవసరం లేదన్న హర్భజన్ వ్యాఖ్యలకు బీసీసీఐ సీనియర్ అధికారి స్పందిస్తూ " అది హర్భజన్ వ్యక్తి గతం " అయినా పాకిస్థాన్ తో లీగ్ దశలో భారత్ ఆడకూడదనుకుంటే , సెమిస్ లేదా ఫైనల్ మ్యాచ్ లలో ఆడాల్సి వస్తే తప్పుకుంటామా ... 1996 కార్గిల్ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయం లో కూడా పాకిస్థాన్ తో భారత్ ఆడిందన్న విషయాన్ని గుర్తుకు తెచ్చాడు.