CM KCR Was Given Green Signal To The Cabinet On Tuesday 19th | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-18

Views 655

There is a lot of speculation about the expansion of Telangana cabinet and many more twists. For the second time government, there is delay in cabinet expansion since two months from election results. Finally, the CM KCR was given Green signal to the Cabinet on Tuesday 19th.
#Telanganacabinet
#CMKCR
#KTR
#harisharao
#etelarajendar
#mpkavitha
#telangana


తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఊహాగానాలు, మరెన్నో ట్విస్టులు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టి రెండు నెలలు గడిచినా.. కేబినెట్ విస్తరణపై ఊసే లేకుండా పోయింది. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. 19వ తేదీ మంగళవారం నాడు కేబినెట్ కొలువుదీరనుంది. అయితే ఇద్దరు సీనియర్లకు మంత్రివర్గంలో చోటు లేదనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.
కొత్త మంత్రుల ఎంపికపై ఆదివారం నాడు సీఎం కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేసినట్లు సమాచారం. అసెంబ్లీలో సభ్యుల సంఖ్యాబలం మేరకు 15 శాతం కోటాతో 18 మందికి మంత్రులుగా ఛాన్స్ దక్కుతుంది. అందుకే 34 శాఖలను ఒకే గొడుగు కిందకు తెచ్చి 18గా మార్చినట్లు సమాచారం. ఆ మేరకు కేసీఆర్ ఆదేశాలతో శాఖల పునర్వ్యవస్థీకరణ జరిగిందట. ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోం మంత్రిగా మహమూద్ అలీ బాధ్యతలు స్వీకరించడంతో మరో 16 మందికి కేబినెట్ లో అవకాశం దక్కనుంది. ఆ మేరకు మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారనే టాపిక్ ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావుతో పాటు ఖజానా మంత్రి ఈటల రాజేందర్ కు కేబినెట్ లో చోటు ఉండకపోవచ్చనే ప్రచారం చర్చానీయాంశమైంది.
కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు.. తెలంగాణ ఉద్యమం తొలినాళ్ల నుంచి ఆయన వెంటే నడిచారు. మామ బొమ్మెస్తే.. అల్లుడు రంగేస్తాడు అనే రీతిలో మామా అల్లుళ్ల బంధం విజయవంతమైంది. హరీశ్ రావు లాంటి చురుకైన నాయకుడికి ఈసారి కేబినెట్ లో బెర్త్ లేదనే ప్రచారం ఆయన అనుచరుల్లో కలవరం రేపుతోంది. హరీశ్ రావుకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కకు పెట్టడంలో పెద్ద స్కెచ్చే ఉందనే వాదనలు లేకపోలేదు. పంచాయతీ రాజ్, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖతో పాటు నీటిపారుదల శాఖను సైతం కేసీఆరే చూడబోతున్నారనే వార్త.. హరీశ్ రావును దూరం పెడుతున్నారనే ప్రచారానికి నిదర్శనం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS