Mega Brother Naga Babu Makes Sensational Comments On Comedian Prudhvi Raj

Filmibeat Telugu 2019-02-18

Views 3

-Mega Brother Nagababu has recently become a social media venue with a series of videos. Nagababu said in an interview that he responded to the Janasena party's criticism about his contribution to his son Varun. Again she was angry with the critics of the woman's attire.
#pawankalyan
#varuntej
#janasenaparty
#prudhviraj
#nagababu
#alluaravind
#chiranjeevi
#dilraju
#tollywood

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల సోషల్ మీడియా వేదికగా వరుస వీడియోలతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనసేన పార్టీకి తాను, తన కుమారుడు వరుణ్ ఇచ్చిన విరాళం గురించి వస్తున్న విమర్శలపై స్పందించారు. మరోమారు మహిళ వస్త్రధారణ గురించి విమర్శలు చేసేవారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు, ఆయన తనయుడు వరుణ్ తేజ్ కలసి 1.25 కోట్లు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విరాళంపై కమెడియన్ పృథ్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కడినుంచో తీసుకొచ్చిన డబ్బుని తన కొడుకు ఖాతాలో వేసి దానిని జనసేన పార్టీకి ఇచ్చారని పృథ్వి వ్యాఖ్యానించాడు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు నాగబాబు దృష్టికి రావడంతో ఆయన పృథ్వికి వార్నింగ్ ఇచ్చారు.
నిజంగానే పృథ్వి ఆ మాట అన్నాడా.. అయితే అతడికి ఇదే నా సమాధానం. అరేయ్ పృథ్వి నువ్వు నాకు ఫోన్ చేయి రా.. నా నంబర్ నీదగ్గర ఉంది. ఈ ప్రశ్నకు నీకు మాత్రమే సమాధానం చెబుతా. ఎవడో ఎదో అంటే అందరి ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని నాగబాబు అన్నారు. తాను, వరుణ్ తేజ్ కలసి టాక్స్ కట్టిన డబ్బునే అధికారికంగా జనసేన పార్టీకి ఇచ్చామని అన్నారు.



Share This Video


Download

  
Report form