Bajrang Dal activists against the Valentine's Day. The rally that took place under Hyderabad LB nagar Police Station led to tensions. About 60 activists were taken to controll by police. The police stoped Bajarang Dal activists in the Panajagutta protesting against the jewelery shops.
#valentinesday
#marriages
#loversday
#telangana
#lovers
#lbnagar
#hyderabad
#nalgonda
#jewelleryshops
వాలంటైన్స్ డే జరుపుకోవడానికి వీల్లేదు అంటూ భజరంగ్ దళ్ హెచ్చరించింది. ప్రేమికుల రోజు జంటలు కనబడితే పెళ్లిళ్లు చేస్తామని స్పష్టం చేసింది. ఆ క్రమంలో లవర్స్ డే ను వ్యతిరేకిస్తూ పలుచోట్ల నిరసనకు దిగారు భజరంగ్ దళ్ కార్యకర్తలు. వాలంటైన్స్ డే ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. దాదాపు 60 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమికుల రోజు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్నారు. పంజాగుట్టలో భజరంగ్ దళ్ కార్యకర్తల ఆందోళనతో టెన్షన్ వాతావరణం నెలకొంది. జ్యువెలరీ షాపుల ఎదుట వారు నిరసనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. వాలంటైన్స్ డే సందర్బంగా బంగారం కొనుగోళ్లపై ఆఫర్లు ప్రకటిస్తూ.. పాశ్చాత్య సంస్కృతిని పెంచి పోషిస్తున్నారంటూ ఆందోళనకారులు ధ్వజమెత్తారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.