Budget 2019:President Ram Nath Kovind has started addressing the joint sitting at Parliament. He is to list out the achievements of the ruling NDA government during the session. He said he is committed to a corruption free India.
#Budget2019
#Budgetsession
#RamNathKovind
#Parliament
#NDAgovernment
#arunjaitly
#narendramodi
#bjp
సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయగీతం ఆలపించడంతో సభలు ప్రారంభమయ్యాయి. అనంతరం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. అవినీతిరహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. నవభారత నిర్మాణానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు రాష్ట్రపతి. ఆయుష్మాన్ భారత్ పథకంతో దేశంలోని 50 కోట్ల మందికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించామని అన్నారు. హృద్రోగులకు అందించే స్టంట్‌ల ధరలు తగ్గించామని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా మహిళల గౌరవం పెంచామని వెల్లడించారు. మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా మూడు కోట్ల కుటుంబాల ఆరోగ్యం మెరుగైందని అన్నారు.