After taking a long break, actress Catherine Tresa has signed a Telugu film opposite none other than Vijay Deverakonda.
#Vijaydeverakonda
#Catherinetresa
#inkeminkemkavalesong
#dearcomrade
విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండతో నెక్స్ట్ మూవీలో క్రేజీ హీరోయిన్ రొమాన్స్ చేసేందుకు సిద్ధం అయినట్లు ఆంగ్ల పత్రికలో కథనాలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్ సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు. హిందీలో ఒక్క చిత్రంలో కూడా నటించినప్పటికీ అతడి పేరు బాలీవుడ్ లో కూడా వినిపిస్తోంది. గత ఏడాది విజయ్ దేవరకొండ నుంచి మూడు చిత్రాలు రాగా అందులో రెండు సూపర్ హిట్స్ గా నిలిచాయి. విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ వివరాలు పరిశీలిద్దాం.
దర్శకుడు క్రాంతి మాధవ్ ఓనమాలు, మళ్లీమళ్లీ ఇది రానిరోజు లాంటి సెన్సిబుల్ చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్నారు. త్వరలో విజయ్ దేవరకొండని క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. క్రాంతి మాధవ్ కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా కథని సిద్ధం చేస్తున్నాడట. కె ఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.