IPL Auction 2019 : Rohit Sharma Led Mumbai Indians Lifeline For Yuvraj Singh

Oneindia Telugu 2018-12-19

Views 181

Yuvraj initially went unsold in the auction and it was only after he re-entered the players’ pool, Mumbai Indians bought him. In 2015, Yuvraj fetched a record Rs 16 crore deal with the Delhi franchise since then his IPL fortunes have fallen rapidly.
ఐపీఎల్ 2019 క్రికెటర్ల వేలంలో సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ ఎట్టకేలకు అమ్ముడుపోయాడు. వేలంలో భాగంగా రెండోసారి యువరాజ్ సింగ్‌ను ముంబై ఇండియన్స్ కనీసధర రూ.కోటికి సొంతం చేసుకుంది. వేలంలో భాగంగా తొలి రౌండ్‌లో యువీకి నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. వచ్చే సీజన్ కోసం వేలంలో ప్రాంఛైజీలు తనను కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో యువరాజ్ సింగ్ ధరను సైతం తగ్గించుకున్నప్పటికీ తొలి రౌండ్‌లో ఫ్రాంచైజీలు మొండి చేయి చూపించాయి. దీంతో.. తొలి విడత అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో ఈ ఆల్‌రౌండర్ చేరిపోయాడు. గతేడాది అతడు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున ఆడాడు. ఆశించిన మేరకు రాణించకపోవడంతో విడుదల చేశారు. సందిగ్ధంలో ఉన్న యువీ తన కనీస ధరను రూ.2 కోట్ల నుంచి కోటికి తగ్గించుకున్నాడు. 2015 ఐపీఎల్‌ వేలంలో రూ. 16 కోట్లకి అమ్ముడుపోయి రికార్డులు నెలకొల్పిన యువరాజ్ సింగ్.. గత మూడు సీజన్లలోనూ అంచనాల్ని అందుకోలేకపోయాడు.
#ipl2019
#IPLAuction2019
#MumbaiIndians
#RohitSharma
#YuvrajSinghunsold

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS