Botsa Satyanarayana Lashed Out At KCR And Chandrababu Naidu | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-15

Views 336

YSR Congress Party leader Botsa Satyanarayana on Friday lashed out at AP CM Nara Chandrababu Naidu and Jana Sena chief Pawan Kalyan. He also angry on KCR comments that trs will come to Ap for next elections.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు తెరాసతో పొత్తుకు ప్రయత్నించి విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్‌ను తెలుగుదేశం నెత్తిన పెట్టుకోవాలని చూసిందని, చంద్రబాబును ఓటుకు కోటు కేసులో శిక్షించి ఉంటే నేడు పరిస్థితి వేరుగా ఉండేదని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో తెరాసను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని, దానికి ప్రతిగా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానని కేసీఆర్‌ ప్రకటించారని గుర్తు చేశారు. ఇందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు మాయమాటలు ప్రజలు నమ్మవద్దని బొత్స అన్నారు. కేసీఆర్‌ విజయవాడ వచ్చినప్పుడు ఆయన కోసం ఏపీ మంత్రులు ఎందుకు క్యూ కట్టారో చెప్పాలన్నారు. ఏపీ ప్రయోజనాల కంటే పార్టీ ​ప్రయోజనాలకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడానికి తాను చేసిన కృషే కారణమని చంద్రబాబు చెప్పిన మాటలు వింటే నవ్వొస్తుందన్నారు.
#ChandrababuNaidu
#BotsaSatyanarayana
#ysjagan
#ysrcp
#apelections
#బొత్ససత్యనారాయణ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS