CM Kumaraswamy meets hospitalised people of Chamarajanagar Temple Prasad incident and Chief Minister has announced a compensation of Rs. 5 lakh for each of the victims' families. Sharing details of the incident, Chief Minister Kumaraswamy informed that Principal Secretary and Commissioner has instructed district health officials of Mandya and Mysore to provide all possible help to health administration in Chamrajnagar.
#KarnatakaGovernment
#TemplePrasad
#Chamarajanagar
#HDKumaraswamy
#compensation
కర్నాటకలో విషాదం చోటుచేసుకుంది. హనూర్‌లోని సుల్వాడీ కిచ్చుగుట్టి మారమ్మ ఆలయంలో ఆహారం తిని 12 మంది మృతి చెందారు ఇందులో 15 ఏళ్ల బాలిక కూడా ఉంది. మరో 80 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేయడం జరిగింది. ఆహారం సేవించిన భక్తులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని మైసూరు, కొల్లెగల్, కమగెరె ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.భక్తులకు ఇచ్చిన ప్రసాదంలో విషం కలిసి ఉండొచ్చని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి వెల్లడించారు. ప్రస్తుతానికి శాంపిల్స్ తీసుకుని పరీక్షల నిమిత్తమై లాబొరేటరీకి పంపామని అధికారులు వెల్లడించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో 12 మంది పరిస్థితి విషమించడంతో వారిని చికిత్స కోసం మైసూరుకు తరలించినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే కొత్తగా నిర్మించిన మారమ్మ ఆలయంలో భక్తులు ఎక్కువగా వచ్చారు. వారికి ప్రసాదాలు అందజేశారు ఆలయ నిర్వహకులు. ప్రసాదం తీసుకున్న భక్తులు వెంటనే వాంతులు చేసుకున్నారు. మరికొందరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకొందరు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు