Telangana State Police on Wednesday seized Rs 86.5 crore cash, four lakh litres of liquor till now as part of preparations ahead of the Assembly elections in the state.
#TelanganaElections2018
#LiquorSeized
#assemblyconstituencies
#Telanganastateformation
#polling
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7 శుక్రవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు మద్యం, డబ్బులను పంచుతున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్నికల ఫ్లయింగ్ స్వాడ్ ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఓటర్లకు పంచుతున్న డబ్బును స్వాధీనం చేసుకుటోంది. కాగా వివిధ ప్రాంతాల్లో బుధవారం ఒక్కరోజే ఏకంగా రూ.7.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన 24 రోజుల్లో.. రాష్ట్రవ్యాప్తంగా రూ.137 కోట్ల విలువైన నగదు, నగలు, మద్యం, ఇతర నజరానాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా మద్యం సరఫరా చేయటానికి అభ్యర్థులు డెలివరీ బాయ్స్‌ను ఎంచుకోవటం గమనార్హం.