The Indian team on Friday reached Australia and captain Kohli tweeted a picture of him with Rishabh Pant to announce his arrival in one of his favourite hunting grounds.
#IndiavsAustralia
#ViratKohli
#RishabhPant
సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరిన టీమిండియా శనివారం ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఆస్ట్రేలియాకు చేరుకున్న తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాను ఓ ఛాంపియన్‌తో కలిసి ఆ దేశంలో ఉన్నానంటూ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లీ పక్కనే ఉన్న ఆ టీమిండియా క్రికెటర్ మరెవరో కాదు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. "ఆస్ట్రేలియా చేరుకున్నాం. కొన్ని వారాల పాటు ఇక్కడే, ఛాంపియన్ రిషబ్ పంత్‌తో" అని కోహ్లీ తన ట్విట్టర్‌లో కామెంట్ పెట్టాడు. విరాట్ కోహ్లీ సెల్ఫీ తీస్తుండగా పంత్ విక్టరీ సింబల్‌ను చూపుతూ ఫోజిచ్చాడు.