gaja cyclone wreaks damage in tamil nadu.
#Gaja
#cyclone
#HeavyRains
#Tamilnadu
నైరుతి బంగాళాఖాతంపై పంజా విసిరిన గజ తుపాను తీర ప్రాంతాల్లో అలజడి రేపుతోంది. గురువారం రాత్రి తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు భావించారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో నాగపట్నం - వేదారణ్యం మధ్య తీరం దాటింది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. నాగపట్నం జిల్లాలోని వేదారణ్యంలో ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం. నాగపట్నం, తిరువాయూరు, పుదుకొట్టై జిల్లాల్లో చెట్లు, పెంకుటిళ్లు కూలిపోగా.. కీచనకుప్పం, అక్కరైపెట్టై ప్రాంతాల్లో నివాసముండే మత్స్యకారుల ఇళ్లల్లోకి సముద్రపు నీరు చేరింది. మరోవైపు నాగపట్నం, కడలూరు, పుదుకొట్టై, కారైక్కల్, తిరువాయూర్, తంజావూర్, త్రిచి జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తిరువాయూర్, తంజావూర్, పుదుకొట్టై, త్రిచి, అరియలూర్ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.