Trs is facing the heat in the campaign with the people blocking the netas and asking them about the promises made.There have been at least seven such incidents where TRS leaders, have faced backlash while on campaign trail.With villages taking oath to boycott elections and asking leaders to sign a bond saying that the promises would be fulfilled—the ruling party leaders are facing the heat.
తెలంగాణలో ఎన్నికల వేడి పెరుగుతోంది. డిసెంబర్ 7న ఎన్నికలు నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ప్రచారం ఒకలా ఉంటే... టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంకు వెళ్లినప్పుడు మాత్రం చేదు అనుభవమే ఎదుర్కొంటున్నారు. ప్రజలు గులాబీ నేతలను నడిరోడ్డుపైనే నిలదీస్తున్నారు. గతవారం తాజా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రచారానికి వెళ్లగా ఆయన కాన్వాయ్‌ను రైతులు అడ్డుకుని నిలదీశారు. అంతకుముందు కూడా ఓ చోట ప్రజలు ఆయన్ను నిలదీశారు. దీంతో ఆయన కారు టాపుపైకి ఎక్కి వారిని సముదాయించాల్సి వచ్చింది.