రష్యా విషయంలో భారత్‌కు మరోసారి అమెరికా తీవ్ర హెచ్చరికలు చేసింది. ఎస్ 400 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రష్యాకు చెందిన ఎస్ 400 మిసైల్స్ కొనుగోలు చేయొద్దని కొన్ని నెలలుగా భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. అయితే, తమ హెచ్చరికలను భేఖాతరు చేస్తూ చర్చలు జరుపుతోందనే నెపంతో అమెరికా.. భారత్‌పై తీవ్ర ఆగ్రహంగా ఉంది. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ వారం భారత్ సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలోనే ఎస్ 400 క్షిపణులకు సంబంధించి కొనుగోలు ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయొచ్చని తెలుస్తోంది.
#Russia
#S-400missile
#america
#chaina
#trump
#vladimirputhin
#narendramodi