Vijay Deverakonda talks about the dynastic system of the Telugu film industry and the issue of releasing NOTA alongside NTR Jr's Aravinda Sametha Veera Raghava.
#VijayDeverakonda
#NTR
#AravindaSamethaVeeraRaghava
#NOTA
విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' అక్టోబర్ 5న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ సినిమాకు సంబంధించిన, తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు తనను ట్రోల్ చేసిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. నోటా రిలీజ్ డేట్ ఫైనల్ చేసేందుకు విజయ్ పోల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో అక్టోబర్ 5, అక్టోబర్ 10, అక్టోబర్ 18 ఆప్షన్లు ఇచ్చారు. అయితే అక్టోబర్ 10న తారక్ సినిమాతో విడుదల చేసే దమ్ముందా? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.