Telangana minister KT Rama Rao on Tuesday takes on at Konda Surekha for her comments on TRS.
#KTRamaRao
#TRS
#KondaSurekha
#harishrao
#kodandaram
టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శల దాడికి దిగిన కొండా సురేఖ దంపతులపై మంత్రి కేటీఆర్ అదే స్థాయిలో విమర్శలు చేశారు. టీఆర్ఎస్‌లో ఉన్నంత కాలం కొండా దంపతులకు తాము మంచి వాళ్లమని, పార్టీ నుంచి వెళ్లిపోయే ముందు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
మంగళవారం సిరిసిల్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్పై విమర్శలు చేసి అవతలి పార్టీ మెప్పు పొందాలని కొండా దంపతులు చూస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల ప్రజా బలమెంతో ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారన్నారు. ఒకరికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, మరో పార్టీ నిస్సిగ్గుగా ఏకం అవుతున్నాయని ఎద్దేవా చేశారు. విలువలకు తిలోదకాలు ఇచ్చి అధికారం కోసం కూటమి కడుతున్నారని మండిపడ్డారు.