టిడిపిపై ప్రశ్నలను సంధించిన బిజెపి పై విరుచుకుపడ్డ అధికార పార్టీ...!

Oneindia Telugu 2018-09-12

Views 7

Several interesting incidents are taking place at the AP Assembly sessions. The BJP MLC Madhav, who questioned about delay in unemployment scheme implementation. Afterthat minister Achhennaidu responded and blamed Madhav comments. In another incident Minister Yanamala Ramakrishnudu satire on another minister somireddy produced comedy at session.
#andhrapradesh
#amaravathi
#assemblysessions
#bjpmlcmadhav
#criticise
#unemploymentbenefit
#ministerachhennaidu
#ministersomireddy

శాసనసభ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం వైసిపి బాయ్ కాట్ చేయడం, టిడిపితో వైరం నేపథ్యంలో ఇప్పుడు బిజెపి నే సభలో అధికారపక్షాన్ని దుయ్యబట్టే పని చేపట్టింది. ఈ నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘట్టాలు చోటుచేసుకుంటున్నాయి. యువనేస్తం కార్యక్రమం అమలులో జాప్యాన్ని నిలదీసిన బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ పై మంత్రి అచ్చెన్నాయుడు పరుషైన పదజాలంతో విరుచుకుపడటం చర్చనీయాంశం అయింది. అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యే పీతల సుజాత ప్రస్తావించిన ఒక సమస్యపై సంబంధిత మంత్రి సోమిరెడ్డి స్పందన, ఆ స్పందనపై మరో మంత్రి యనమల సంధించిన సెటైర్ సభలో నవ్వులు పూయించాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS