వరద బాధితులకు స్వయంగా నిత్యావసరాలు ప్యాకింగ్‌ చేస్తున్న సుధామూర్తి

Oneindia Telugu 2018-08-24

Views 112

Narayana Murthy's wife & philanthropist Sudha Murthy is doing her best to help the survivors of Kodagu. She was seen packing relief materials for people.
#Karnataka
#Floods
#Rains
#Kerala
#Help
#Kodagu
#Donation
#Infosys
#SudhaMurthy


కేరళలో బీభత్సం సృష్టించిన భారీ వర్షాలు, వరదలు కేరళ-కర్ణాటక సరిహద్దులోని కొడగు జిల్లాను కూడా అతలాకుతలం చేశాయి. వరదల కారణంగా కొడగులో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న కొడగు జిల్లాలోని ప్రజలకు సాయం చేయడానికి టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, సామాజిక కార్యకర్త సుధామూర్తి ముందుకొచ్చారు.
ఇన్ఫోసిస్‌ ఉద్యోగులతో కలిసి వరద బాధితులకు నిత్యావసరాలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమె స్వయంగా సరుకులను ప్యాక్‌ చేయడంతోపాటు సంస్థ ఉద్యోగుల పనిని దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా, సుధామూర్తి ఔదార్యాన్ని వీడియో తీసిన కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది. ఎంతోమంది సుధామూర్తి గొప్పమనసును మెచ్చుకున్నారు. ఈ వీడియోను ‘అమ్మ’ అనే హ్యాష్‌టాగ్‌తో షేర్‌ చేసుకుంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS