బీహార్ ముజాఫర్‌పూర్‌లో వెలుగు చూసిన బాలికల అత్యాచార ఘటనలో అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సెక్స్ రాకెట్‌కు నేపాల్ నుంచి బంగ్లాదేశ్‌వరుకు మూలాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న బ్రజేష్ ఠాకూర్ ప్రభుత్వం నుంచి నిధులు, ఆర్డర్లు పొందేందుకు అధికారుల వద్దకు షెల్టర్ హోమ్‌లోని అమ్మాయిలను పంపేవాడని తెలుస్తోంది.
గతవారమే సీబీఐ ఈ కేసును తన చేతుల్లోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. సీబీఐ ముందు పోలీస్ అధికారులు రిపోర్ట్‌ను తయారు చేశారు. దాని ప్రకారం బ్రజేష్ ఠాకూర్ కొన్ని ఎన్జీఓలు నడుపుతున్నాడు.తన బంధువులు బ్యాంకుల్లో ఇతరత్ర ప్రభుత్వ సంస్థల్లో కొన్ని కీలక స్థానాల్లో ఉన్నారు. వారి ద్వారా అక్రమ పద్దతుల్లో డబ్బును రాబట్టేవాడు. తాను జర్నలిస్టునని చెప్పుకుని ఎన్నో పనులను అడ్డదారుల ద్వారా చేయించుకున్నాడని రిపోర్ట్ వెల్లడించింది.
#muzaffarpur
#bihar
#rackets
#cbi
#Police