Actor Sivaji at Jana Sena chief Pawan Kalyan for his comments on Andhra Pradesh capital Amaravati.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నటుడు శివాజీ ఆదివారం నిప్పులు చెరిగారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. అమరావతిని ఆపేస్తామని చెబుతున్న పవన్ దానిని ఎక్కడ నిర్మిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే పవన్, జగన్‌లు ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ 54 దేశాలు తిరిగితే ఒక్క పరిశ్రమ రాలేదని, చంద్రబాబు లక్ష కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు నవ్యాంధ్రకు తెచ్చారన్నారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే రైళ్లు ఆపేందుకు, కేంద్ర ప్రభుత్వం సంస్థలను స్తంభింపచేసేందుకు సిద్ధమని, పవన్, జగన్‌లు వస్తారా అని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు. మనం గట్టిగా, ఐక్యంగా నిలబడితే ప్రత్యేక హోదా వస్తుందని శివాజీ అన్నారు.
#Sivaji
#PawanKalyan