Sachin Tendulkar launches cricket academy

Oneindia Telugu 2018-07-19

Views 14


భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ త్వరలో క్రికెట్ అకాడమీని ప్రారంభించబోతున్నాడు. మిడిలెసెక్స్‌ క్రికెట్‌తో కలిసి 'టెండూల్కర్ మిడిలెసెక్స్‌ గ్లోబల్‌ అకాడమీ (టీఎంజీఏ)'ను ప్రారంభించబోతున్నట్లు సచిన్‌ బుధవారం తెలిపాడు. ఇద్దరి సంయుక్త భాగస్వామ్యంలో రూపొందనున్న ఈ అకాడమీకి టెండూల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ క్రికెట్ అకాడమీ (టీఎమ్‌జీఏ)గా నామకరణం చేశారు.
ఈ అకాడమీ ద్వారా 9 నుంచి 14 ఏళ్ల వయస్సులోపు బాలబాలికలకు సచినే స్వయంగా శిక్షణ ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జరగనున్న శిక్షణ కార్యక్రమాలను మొదటి క్రికెట్‌ క్యాంపులోభాగంగా వచ్చే నెల 6 నుంచి లండన్‌లోని నార్త్‌వుడ్‌లో ఉన్న మర్చంట్‌ టేలర్స్‌ స్కూల్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత లండన్, ముంబైలకు కూడా దీనిని విస్తరించనున్నారు. మిడిలెసెక్స్‌లోని ప్రొఫెషనల్ కోచ్‌లు పూర్తిస్థాయి సమగ్ర శిక్షణ కరికులమ్‌ను రూపొందించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS