ఉద్యోగ అర్హతా పరీక్షలకు సంబంధించి సిలబస్ ను ఉద్యోగ విధులకు తగినట్లుగా రూపొందించడంపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సీ) దృష్టిపెట్టింది. ముఖ్యంగా గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్) కింద రెండు రాత పరీక్షలను నిర్వహించాలని ఎపిపిఎస్సీ నిర్ణయించింది. మెయిన్స్ పరీక్షను ఆంగ్లంతో పాటు తెలుగు పరీక్షలోనూ అర్హత సాధిస్తేనే మిగిలిన జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు అభ్యర్థుల సౌకర్యార్థం గ్రూపు-1 ప్రధాన పరీక్షల సిలబస్‌లో ఎటువంటి మార్పులు చేయకుండానే ఒకే అంశానికి సంబంధించిన ప్రశ్నలను ఒకచోట మాత్రమే ఇవ్వాలని ఎపీపీఎస్సీ భావిస్తోంది.