భారతదేశంలోని స్త్రీ ను ఒక ఆటబొమ్మల ఒక వస్తువుగా చూడటం ఇప్పటికీ కొనసాగుతుందనే చెప్పాలి. అమ్మాయిలు నిత్యం ఏదో రకంగా చీదరింపులు ఎదుర్కొనే పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. నేటికీ స్త్రీ వ్యక్తిత్వాన్ని కొన్నిచోట్ల దిగజార్చుతోంది ఈ సమాజం. కేవలం పడక సుఖానికే మహిళ అంకితం అన్నట్లుగా ఇంకా కొందరు భావిస్తున్నారు. రోజు రోజుకి స్త్రీలపై కీచక పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి.
స్త్రీ గర్భాశయాన్ని అద్దెకిచ్చే దశ నుంచి, భర్తలు తమ భార్యలను పరాయి పురుషుడికి అద్దెకిచ్చే దశకి వచ్చారు.. అవును, మీరు విన్నది నిజంగా నిజమే. భార్యను పరాయి పురుషుడికి అద్దెకి ఇచ్చే సంప్రదాయం ఇంకా కొన్ని చోట్ల ఉంది. స్త్రీని దేవతగా పూజించిన దేశం మనది.