One more pic of Renu Desai fiance. Renu again hiding his face.
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో వివాహానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి ఆమె విడాకులు పొంది ఏడేళ్లు గడిచిపోతోంది. ఇన్నేళ్ళపాటు ఆమె పుణేలో తన పిల్లలతో గడిపింది. ఇటీవలే తాను రెండో వివాహం చేసుకోవాలని రేణు దేశాయ్ నిర్ణయించుకోవడం, ఎంగేజ్ మెంట్ చకచకా జరిగిపోయాయి. త్వరలో వివాహం జరగబోతోంది. కానీ ఇంత వరకు వరుడు ఎవరనే సంగతి బయట ప్రపంచానికి తెలియదు. తనకు కాబోయే భర్త వివరాలని రేణు ఇంకా గోప్యంగానే ఉంచుతోంది.
రేణు దేశాయ్ ప్రస్తుతం తన పిల్లలు, కాబోయే భర్తతో అమెరికాలో విహరిస్తునట్లు తెలుస్తోంది. వివాహానికి ముందు వీరంతా టూర్ వెళ్లారు. రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాక.. పవన్ తో విడాకుల విషయంపై కూడా రేణు పెదవి విప్పింది.పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు నేను కోరుకోలేదని రేణు క్లారిటీ ఇచ్చింది. తాను ఉండగానే మరో మహిళతో బిడ్డకు జన్మనిచ్చిన విషయంలో వివాదం విడాకులకు దారి తీసిందని రేణు ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది.