Janasena Chief Pawan Kalyan' eye surgery is successful. Pawan Kalyan need one week rest
#Janasena
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా కంటి సమస్యతో భాదపడుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ కావడంతో ఆరోగ్యంపై దృష్టిపెట్టే సమయంలో లేకుండా పోయింది. వాస్తవానికి ఈ కంటి సమస్య చాలా రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ చికిత్స చేయించుకోవాలి. కానీ బిజీ పొలిటికల్ షెడ్యూల్ కారణంగా కుదరలేదు. ఇటీవల విశాఖ పర్యటనతో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ ముగిసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజాగా కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో పవన్ చికిత్స చేయించుకున్నారు. శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు పవన్ కంటిపై ఏర్పడ్డ కురుపుని తొలగించారు. గురువారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ఆసుపత్రి నుంచి డిచ్చార్జీ అయినట్లు తెలుస్తోంది.
శస్త్ర చికిత్స తరువాత వారం రోజులపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు పవన్ కళ్యాణ్ కు సూచించినట్లు తెలుస్తోంది. దీనితో పవన్ కళ్యాణ్ తదుపరి పొలిటికల్ టూర్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రంగస్థలం సక్సెస్ మీట్ లోనే పవన్ కళ్యాణ్ నల్లటి అద్దాలతో కనిపించారు. వెలుగు పడకుండా ఈ అద్దాలని ధరించినట్లు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ సక్సెస్ మీట్ లో తెలిపారు. అప్పటి నుంచే పవన్ కంటికి ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలుస్తోంది.