వైయస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ఇవ్వాలని వైసీపీ నేతల అభిప్రాయం వ్యక్తం

Oneindia Telugu 2018-07-10

Views 394

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ఇవ్వాలని కోరుతూ కోటి సంతకాల ఉద్యమం చేపట్టారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు సోమవారం ప్రకటించారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో వైయస్సార్ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన వైయస్ జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి నేతలు నివాళులర్పించారు. వైయస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ఇవ్వాలని కోటి సంతకాల ఉద్యమాన్ని అక్కడి నుంచే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌, ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్‌, గౌరు చరిత, రవీంద్రనాథ్ రెడ్డి, కోన రఘుపతి, ప్రతాప్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
వైయస్‌కు భారతరత్న కోరుతూ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఈ కోటి సంతకాల సేకరణను ప్రారంభించింది. ఈ సమావేశానికి నాటా అడ్వైజరీ కౌన్సెల్ చైర్ పర్సన్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, వైసీపీ నేతలు కారుమూరి నాగేశ్వర రావు, లక్ష్మీపార్వతి, శిల్పా చక్రపాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

The North American Telugu Association (NATA) has resolved to collect over one crore signatures demanding Bharat Ratna for late YS Rajasekhara Reddy.
#RajasekharaReddy

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS