మహారాష్ట్రకు రెడ్ కలర్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

Oneindia Telugu 2018-07-10

Views 818

రానున్న నాలుగైదు రోజుల్లో కూడా ఉత్తర, మధ్య భారత దేశంలో వర్షాలు కురుసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, గోవా తీర ప్రాంతాలలోను భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ సీజన్‌లో ముంబైలో భారీ వర్షపాతం నమోదయింది. భారీ వర్షాలు, రోడ్లన్నీ జలమయం కావడంతో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. రోడ్ల పైన మొత్తం నీరు నిలిచింది. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ముంబైలోని చాలా ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపించింది. ప్రజలు మోకాలు లోతు నీటిలో ఇబ్బందులు పడుతూ ముందుకు సాగారు.
జులై 13వ తేదీ వరకు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఉంటుంది. రానున్న ఐదారు రోజుల్లో రుతుపవనాల ప్రభావం దక్షిణాది, మధ్య భారతంపై ఉంటుంది. రానున్న 48 గంటల్లో నార్త్ వెస్ట్ ఇండియాలో మరిన్ని వర్షాలు కురవనున్నాయి. ఈస్ట్, నార్త్ ఈస్ట్ ఇండియాలో రానున్న నాలుగైదు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముంది.

The India Meteorological Department forecast today that monsoon rains over north and central India would pick up in the next 4-5 days, even as heavy rainfall continued to hammer coastal Maharashtra and Goa.
#monsoon
#weatherforecast
#rains
#andhrapradesh
#Mumbai

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS